← Back to news

ఎలుకలు కొడుతున్న ఇందిరమ్మ చీరలు!

By BK· 7 Aug 2026· Youtu· TG
ఎలుకలు  కొడుతున్న ఇందిరమ్మ చీరలు!

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని వర్క్‌షాప్‌ గోదాములో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయకుండా ఎలుకల పాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ మండిపడ్డారు. 2025 నవంబర్ నాటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇందిరమ్మ చీరలు పంచుతామని ప్రకటించి, ఇవ్వకుండా గోదాముల్లో పడేసి ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలు ఈ చీరలు వద్దంటున్నారా లేక ప్రభుత్వమే పంచడం లేదా అని, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More in News