← Back to news

హోటల్‌కు తాళం.. మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

By DK· 1d ago
హోటల్‌కు తాళం.. మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

తెలంగాణ ఉద్యమంలో హన్మకొండలో ఉద్యమకారులు, విద్యార్థులకు ఉచితంగా భోజనం అందించిన కేదారి, పుష్పలత దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హోటల్ అద్దె చెల్లింపు విషయంలో షట్టర్ యజమాని కుమారుడు రాము తమను దూషించి హోటల్‌కు తాళంవేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. కేదారి అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ పుష్పలత మృతి చెందారు. షట్టర్ యజమాని, అతడి కుమారుడు రాముపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More in TG