← Back to news

పిల్లలకు చూపు లేదు.. సాయం కోసం ఎదురుచూపు

By DK· 1d ago
పిల్లలకు చూపు లేదు.. సాయం కోసం ఎదురుచూపు

TG: చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలకు చూపు కోల్పోవడంతో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లొంక సునీత, స్వామి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు కార్తీక్‌ (8)కు మెదడులో సమస్య రావడంతో ఇల్లు అమ్మి వైద్యం చేయించారు. కావ్యలక్ష్మి (7), ఉదయ్‌కిరణ్‌ (4)లకు చూపు మందగించడంతో అప్పులు చేసి శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఊరి చివర పాకలో నివసిస్తున్నారు. చూపులేని పిల్లలను పాఠశాలలో చేర్చుకోకపోవడంతో ఇంటివద్దే ఉంటున్నారు.

More in TG