బలంగా అల్పపీడనం.. భారీ వర్షాల అలర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇప్పుడు ఒడిశా భూభాగంపై ఉంది. గంటకు 47 కిలోమీటర్ల వేగంతో దాని సుడిగాలులు తిరుగుతున్నాయి. దాని వల్ల ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ సెప్టెంబర్ 12న ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ - IMD చెప్పింది. తెలంగాణలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడతాయని తెలిపింది. రెండు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకూ తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది. ఏపీ మత్స్యకారులు ఇవాళ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని IMD హెచ్చరించింది.


