తెలంగాణలో పనీర్ బ్యాన్!

ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కృత్రిమంగా తయారుచేసే 'అనలాగ్' (నాన్-డెయిరీ/ఆర్టిఫిషియల్) పనీర్‌పై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నిషేధం విధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం సెప్టెంబర్ 10, 2026 నుంచే ఈ ఆర్డర్స్ అమల్లోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా అనలాగ్ పనీర్ తయారీ, ప్రొసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, ట్రాన్స్పోర్ట్ అండ్ అమ్మకాలపై ఏడాది పాటు ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.



