గ్యాస్ లీక్ ఘటనలో కాలిన గాయాలతో యువతి మృతి

AP: బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ(23) ఈ నెల 14న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న చంద్రప్రియ బుధవారం మృతి చెందింది. యువతి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



