ఆఫీసర్ల నిర్లక్ష్యం.. రైతు పంట నష్టం

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో అధికారులు ఎస్సారెస్పీ కాలువల రిపేర్లు చేయకపోవడంతో దమ్మాయిగూడెం పిల్ల కాలువలో పిచ్చిమొక్కలు పేరుకుపోయి నీళ్లు జామ్ అయ్యాయని అక్కడి ప్రజలు తెలిపారు. భక్త రామదాసు ప్రాజెక్ట్ నీళ్లు వదలడంతో కాలువ తెగిపోయి ఓ రైతు పామాయిల్ తోట మునిగిపోయింది. చెట్ల వేర్లు కుళ్ళిపోయి భారీగా నష్టం జరుగుతోందని బాధిత రైతు వాపోయాడు. ఆఫీసర్లు వెంటనే స్పందించి కాలువకు రిపేర్లు చేసి పంట నష్టపోకుండా చూడాలని కోరాడు.

