అధికారిగా ఉన్న జైలులోనే ఖైదీగా

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ దేవేందర్ 10 వేల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. రిమాండ్ ఖైదీకి జైల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ములాఖత్‌లకు అవకాశం కల్పించేందుకు, ఖమ్మం జైలుకు తరలించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. మధ్యవర్తి ద్వారా డబ్బు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో అధికారిగా పనిచేసిన అదే జైలులో దేవేందర్ ఖైదీగా మారారు.



