← Back to news

కోటి రుద్రాక్షల గణపతి.. విశాఖలో విశేషం!

By Jagadish· 17h ago
కోటి రుద్రాక్షల గణపతి.. విశాఖలో విశేషం!

విశాఖపట్నం జిల్లాలో వినాయక చవితి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. బీచ్ రోడ్డులోని గోకుల్ పార్క్ సమీపంలో ఓ ప్రత్యేక గణనాధుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. దీన్ని సుమారు కోటి రుద్రాక్షలతో తయారు చేశారు. యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరప్పు రాజు, ఆయన బృందం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్, కేదార్నాథ్, బద్రీనాథ్ నుంచి ప్రత్యేకంగా రుద్రాక్షలు తెప్పించారు. కోటి రుద్రాక్షల గణనాధుడిని దర్శించుకుంటే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 21 రోజుల పాటు భక్తులు దర్శనం చేసుకోవచ్చు.

More in Local