మోటర్లతో నీటి తరలింపు.. మైల్వార్ రైతుల్లో ఆందోళన

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్లోని అక్కలమ్మ చెరువు నీటి వినియోగంపై మైల్వార్, కొత్లాపూర్ రైతుల మధ్య వివాదం నెలకొంది. చెరువు కింద 500 ఎకరాల ఆయకట్టు ఉండగా, యాసంగి పంటల సాగుకు నీరు అవసరమని మైల్వార్ రైతులు చెబుతున్నారు. చెరువు ఎగువన కొత్లాపూర్ రైతులు మోటార్లు, పైపులతో నీటిని తరలిస్తుండటంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని మైల్వార్ రైతులు కోరుతున్నారు.



