జస్ట్ 1 నిమిషం లేట్! కూతురు కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్న తండ్రి!
కీసర నీట్ ఎగ్జామ్ సెంటర్‌లో ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగింది. గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించడం వల్ల ఒక స్టూడెంట్ కేవలం ఒక్క నిమిషం లేట్‌గా ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చింది. దాంతో ఎగ్జామ్ రాసేందుకు అఫీషియల్స్ పర్మిషన్ ఇవ్వలేదు. తన కూతురి ఫ్యూచర్ పాడైపోతుందని, లోపలికి పంపించాలంటూ ఆ తండ్రి అక్కడున్న పోలీసుల కాళ్లు పట్టుకుని ఏడుస్తూ బతిమాలాడు. అయినా రూల్స్ ఒప్పుకోకపోవడంతో లాభం లేకపోయింది. సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన ఎగ్జామ్ రాయలేకపోయామని ఆ స్టూడెంట్, పేరెంట్స్ ఎంతో ఆవేదనతో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



