దోమ కుడితే జికా.. మగవారికే కొత్త రిస్క్!

దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్‌పై మరోసారి అలర్ట్ మొదలైంది. సాధారణంగా జికా సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి మైల్డ్ సింప్టమ్స్ వస్తాయి. కొన్ని కేసుల్లో నరాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ముఖ్యంగా పురుషుల నుంచి సెక్సువల్ పార్ట్‌నర్‌కు వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. వీర్యంలో వైరస్ కొంతకాలం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులకు జికా సోకితే పుట్టబోయే బేబీపై ప్రభావం పడే రిస్క్ ఉంది. దోమలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.



