దొంగతనానికి వెళ్తే లోపలే చిక్కుకున్న దొంగలు!
ఒక మొబైల్ షాపులో దొంగతనం చేద్దామని వచ్చిన దొంగలకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వారు లోపల ఉండగానే ఎవరో బయట నుండి షూట్టర్ లాక్ చేసేశారు. ఇంకేముంది.. లోపలే ఉండిపోయిన దొంగలు బయటకు రావడానికి నానా తంటాలు పడ్డారు. దొంగతనం చేయడానికి వచ్చి, ఇప్పుడు తమను వదిలేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు.



