← Back to news

నర్సంపేట గులాబీ నేతలతో భేటీ కానున్న KTR

By THOORPATI RAJASHEKAR· 1d ago· Narsampet (Ct), Narsampet, Warangal
నర్సంపేట గులాబీ నేతలతో భేటీ కానున్న KTR

నర్సంపేట BRSలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం తర్వాత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు HYDలోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. నర్సంపేట ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతతో పాటు ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకంపై చర్చించనున్నారు.

More in Local