← Back to news

పండుగపూట ఆర్టీసీ బాదుడు.. ప్రజారవాణా లక్ష్యమిదేనా?

By THOORPATI RAJASHEKAR· 19h ago· Hanamkonda, Hanamkonda, Hanumakonda
పండుగపూట ఆర్టీసీ బాదుడు.. ప్రజారవాణా లక్ష్యమిదేనా?

దసరా పండుగ వేళ హనుమకొండలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ప్రయాణికులకు భారం పెరిగింది. హనుమకొండ నుంచి రేగొండకు టికెట్ ధర ₹70 నుంచి ₹100కు పెంచారు. ప్రత్యేక బస్సులే కాదు.. సాధారణ సర్వీసుల్లోనూ spl ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పండుగ పూట కూడా నార్మల్ ఛార్జీలు పెట్టి, బస్సుల సంఖ్యను పెంచితే OR పెరగడంతో పాటు, RTCకి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా ఆర్టీసీయే ఛార్జీలు పెంచడం అంటే ప్రయివేటు ఆపరేటర్ల దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లే. ప్రజారవాణా అంటే ఇదేనా?

More in Local