39 గంటల రెస్క్యూ.. అయినా దక్కని బాలుడి ప్రాణం!

రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. భోమారామ్ (9) అనే బాలుడు ఆడుకుంటూ బోర్వెల్లో పడిపోయాడు. సుమారు 610 అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడిని బయటకు తీసేందుకు NDRF, NDRF టీమ్స్ 39 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. శనివారం ఉదయం బాలుడిని బయటకు తీసి హాస్పిటల్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. బాలుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.


