← Back to news

గేదెల మృతి.. బాధ్యులపై చర్యలకు డిమాండ్!

By ORSU KRISHNA· 17h ago· Narasaraopeta (R) (Part), Narasaraopet, Palnadu
గేదెల మృతి.. బాధ్యులపై చర్యలకు డిమాండ్!

పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల రెవెన్యూ పరిధిలోని దుష్మన్పేటలో ఈ నెల 3న అక్రమ విద్యుత్ తీగలు తగిలి రామవత్ పద్మాబాయికి చెందిన రెండు గేదెలు మృతి చెందాయి. అటవీ ప్రాంతంలో జింక మృతి చెందిన ఘటనపై శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు విద్యుత్ శాఖ ఈఈ, జిల్లా ఫారెస్ట్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని, అక్రమ విద్యుత్ తీగలను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు.

More in Local