కాఫీ రైతులకు భారీ గెయిన్.. ఈసారి డబుల్ యీల్డ్!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ రైతులకు గుడ్ న్యూస్. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఈసారి కాఫీ పంట డబుల్ యీల్డ్ ఇస్తోంది. సాధారణంగా ఏటా ఆక్టోబర్ నుంచి కాఫీ పండ్లు కోతకు వస్తాయి. కానీ ఈ ఏడాది అనుకూల వాతావరణంతో రెండు సీజన్లలోనూ కాఫీ దిగుబడి వస్తోంది. జిల్లాలో సుమారు 1.90 లక్షల మంది రైతులు 2.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. ఇందులో 1.62 లక్షల ఎకరాల్లో పంట దిగుబడి వస్తోంది. ఈసారి 17 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతోంది.
