← Back to news

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల ప్రోత్సాహం

By DK· 1d ago
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల ప్రోత్సాహం

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయంలో లయన్స్ క్లబ్, దాతల సహకారంతో గ్రామస్తులకు మట్టి ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా పురోహితుడు వేలేటి రామ్మోహన్‌శర్మ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులను అందించడం శుభసూచకమన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను చాటేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

More in Local