గణేశ్ నిమజ్జనంపై... సజ్జనార్ వార్నింగ్
TG: గణేశ్ నిమజ్జనం, ఊరేగింపుల్లో లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో పాత వీడియోలు, అసత్య ప్రచారాలు,గొడవలు పెంచే వారిపై పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేసి, విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసభ్యకర పాటలు, డ్యాన్స్‌లతో పండుగ వాతావరణాన్ని చెడగొడితే వీడియోల ఆధారంగా చర్యలు తప్పవని అన్నారు.



