ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు అరెస్ట్

TG: నిర్మల్ జిల్లా భైంసా సబ్‌డివిజన్ పరిధిలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను ముధోల్ సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది నెలల్లో నమోదైన 33 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులను పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ఛేదించారు. నిందితుల నుంచి సుమారు 250 కిలోల రాగి తీగలు, పలు ఎలక్ట్రికల్ వస్తువులు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.



