← Back to news

నర్సంపేటలో బతుకమ్మ సంబరాలు

By Chippa Naga· 7h ago· Warangal
నర్సంపేటలో బతుకమ్మ సంబరాలు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల ఐక్యతకు నిదర్శనమైన ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

More in Local