← Back to news

కబడ్డీ, వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు

By Kendyala Balaraju· 1d ago· వనపర్తి జిల్లా
కబడ్డీ, వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మండలస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దివంగత తాడిపర్తి సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు టీ.సాయి చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక స్టేడియం గ్రౌండ్‌లో జరిగే పోటీల ద్వారా గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడం, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, గ్రామాల మధ్య స్నేహభావాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

More in Local