గ్యాస్ లేకుండానే మంట! సరికొత్త ప్లాస్మా స్టవ్

ఇకపై గ్యాస్ సిలిండర్లతో పనిలేకుండానే, విద్యుత్తుతో గ్యాస్ స్టవ్ తరహాలో వంట చేసుకోవచ్చు. అదే ఈ Electric Flame Plasma Stove ప్రత్యేకత.LPG లేకుండా విద్యుత్తు ద్వారా ప్లాస్మా టెక్నాలజీతో నిజమైన మంటను సృష్టిస్తుంది. ఇండక్షన్ స్టవ్‌లా కాకుండా, దీనిపై మనం గ్యాస్ పొయ్యిపై చేసినట్లుగానే అన్ని రకాల పాత్రలతో వంట చేయవచ్చు. ఇది గాలిని అయనీకరణం (Ionize) చేయడం ద్వారా 1200°C నుండి 1300°C వరకు వేడిని ఇచ్చే ప్లాస్మా జెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చూడటానికి సాధారణ గ్యాస్ మంటలాగే కనిపిస్తుంది. గ్యాస్ లీకేజీ భయం ఉండదు. గ్యాస్ లభ్యత ఇంకా సంక్షోభంలో ఉండడంతో ఇలాంటి స్టవ్ లు బెటర్ ఆప్షన్. కానీ రేట్ కాస్త ఎక్కువే. దాదాపుగా రూ 35,000 ఉంది. మిడిల్ క్లాస్ కి అందుబాటులో రావాలంటే కాస్త టైమ్ పడుతుంది.



