దక్షిణాది అవార్డుల్లో ఆమెది ఒక రికార్డు !

జానకమ్మని వరించని అవార్డులు లేవు. ఉత్తమ నేపధ్య గాయనిగా నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వ జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ళ వయసు (తెలుగు) చిత్రంలోని "సిరిమల్లె పువ్వా" పాటకు గాను ఆమెకు జాతీయ అవార్డు దక్కింది.మలయాళం, తమిళ భాషల్లోనూ ఆమె నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక నంది అవార్డుల కైతే కొదవేలేదు. దాదాపు 10 సార్లు నంది అవార్డు పొందారు. మలయాళం లో 14 సార్లు , తమిళంలో 7రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. 2013 లొనే కేంద్రం ఆమెకు పద్మ భూషణ్ ప్రకటించినా చాలా ఆలస్యంగా తనకు అవార్డు ఇచ్చారని, దక్షిణాదికి ప్రాధాన్యత లేదంటూ ఆమె సున్నితంగా తిరస్కరించారు.



