స్కూల్ యూనిఫామ్‌లో DEO.. షాకైన స్టూడెంట్స్

AP: అనకాపల్లి DEO గిడ్డి అప్పారావు నాయుడు చోడవరంలోని కొత్తూరు ZP బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్కూల్ యూనిఫామ్ ధరించి వచ్చారు. దీంతో అక్కడున్న స్కూల్ పిల్లలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు, ఆపిల్స్ అందించి ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు. APలో శుక్రవారం నుంచి స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యాబోధన ఉంటుందని.. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు.



