డీఎస్సీపై తగ్గేది లేదు: సజ్జల

AP: డీఎస్సీలో అడ్డదారిలో ఉద్యోగాలు ఎలా వచ్చాయో బయటపడుతోంది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న ఆయన.. ఈ అంశంపై వైసీపీ పోరాటం కొనసాగుతుంది అని అన్నారు. ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసేందుకు ఇద్దరు మహిళా అధికారులను ఎంపిక చేశారన్న సజ్జల.. మెగా డీఎస్సీ పేరుతో టీచర్ పోస్టులను అడ్డదారిలో అమ్ముకున్నారని మండిపడ్డారు. ఈ స్కాంకి మూల సూత్రధారి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అని ఆయన ఆరోపించారు.



