రెండు రోజులకే ‘ప్యారడైజ్’ లీక్?

నాని నటించిన ‘ప్యారడైజ్’ సినిమాకు ఆన్‌లైన్ లీక్ సమస్య ఎదురైంది. విడుదలైన రెండు రోజులకే మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అయిందంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో వసూళ్లపై ప్రభావం పడొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పైరసీకి అడ్డుకట్ట వేసి, చర్యలు తీసుకోవాలని అభిమానులు మేకర్స్‌ను కోరుతున్నారు. తొలి రెండు రోజుల్లోనే 114 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.


