← Back to news

రఘునాథపల్లిలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

By Bala· 2h ago
రఘునాథపల్లిలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుసుంబాయి తండా-లుతండా మధ్య వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖిలాషాపురం నుంచి ఆంధ్రతండాకు వెళ్లే ప్రధాన రహదారిపై కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీటమునిగాయి. దీంతో గ్రామాల చెరువులు అలుగు పోస్తుండగా, హైదరాబాద్-రంగల్ 163 జాతీయ రహదారిపై రఘునాథపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

More in Local