కోడేరు పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత
కోడేరు పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. SM(Social Media) పోస్టుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. SM కార్యకర్త పరమేష్ నాయక్‌పై ఎస్సై వేణుగోపాల్ దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. SMలో అతను చేసిన పోస్టులపై కాంగ్రెస్ నేత పాండు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పరమేష్ నాయక్‌పై ఎస్సై దాడి చేయడాన్ని ఖండిస్తూ బీజేపీ నేత ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు.



