← Back to news

స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

By BUJJIBABU· 19h ago· Guntur

మంగళగిరి యర్రబాలెంలో స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ఏడో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు 100 మందికి అన్నదానం చేశారు. ట్రస్ట్ అధ్యక్షురాలు చిల్లపల్లి మల్లీశ్వరి మాట్లాడుతూ గత ఆరేళ్లుగా దాతల సహకారంతో నిరుపేదలు, వృద్ధులు, బాలబాలికలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం, గుండె ఆపరేషన్లకు తోడ్పాటు, ఉచిత మందుల పంపిణీ వంటి సేవలు అందిస్తున్నామన్నారు.

More in Local