IAS తీరుపై నెటిజన్ల ఫైర్

జమ్ముకశ్మీర్లో IAS అధికారి కుమార్ రాజీవ్ రంజన్ ఓ మహిళా అధికారితో దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమావేశంలో బీనిష్ వనీతో వాగ్వాదానికి దిగిన ఆయన, ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సస్పెండ్ చేయాల్సింది ఆమెను కాదు.. మహిళలతో ఎలా మాట్లాడాలో తెలియని నిన్ను!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.


