ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్

AP: నెల్లూరు లోని రేబాల వీధిలో నగరపాలక సంస్థ.. పేద, మధ్య తరగతి వారికి ఫంక్షన్ హాల్ నిర్మించింది. మోడ్రన్ ఫంక్షన్ హాల్‌ను కేవలం 1 రూపాయికే అద్దెకు ఇస్తోంది. ఇది 5 వేల మంది కూర్చునే సామర్థ్యం కలిగివుంది. సెంట్రల్ ఏసీ, పార్కింగ్ సౌకర్యం ఉంది. 1 కోటి 40 లక్షల రూపాయలతో దీనిని నిర్మించారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఖర్చు తగ్గించేందుకు దీనిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.

