మానవత్వానికి నిలువెత్తు రూపం.. మన్యం కలెక్టర్ !!

మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆయన రియల్ 'GOAT' (Greatest Of All Time) అంటూ జనం పొగిడేస్తున్నారు. నో ప్రోటోకాల్.. ఓన్లీ హ్యుమానిటీ అంటున్నారు మన్యం కలెక్టర్. చినభొగిలి మండలం దగ్గర రోడ్డు మీద బాధితుడిని చూడగానే వెంటనే రియాక్ట్ అయ్యారు. తన హోదా, ప్రోటోకాల్ పక్కనపెట్టి ఫోన్ చేసి ఆర్డర్స్ వేయడం కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి బాధితుడిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బాధితుడికి ఫస్ట్ ఎయిడ్ చేయించి,ఆపై మళ్ళీ పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లి జాయిన్ చేయించారు. పవర్ ఉన్నవాళ్లు కాకుండా, మనసున్న వాళ్లే రియల్ సెలబ్రిటీలు అని కలెక్టర్ గారు ప్రూవ్ చేశారు.



