దళితులను అవమానిస్తే సహించం: KPVS

TG: దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని KPVS జిల్లా నాయకుడు ఎడ్ల సురేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఆయన మాట్లాడుతూ.. దళితులను అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడుతామని తెలిపారు. అంబేడ్కర్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని ఎడ్ల సురేష్ పేర్కొన్నారు.


