ఢిల్లీలో ప్రధాని మోదీ పూజలు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ.. వినాయక ఆలయంలో పూజలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ్టికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. "దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యుల సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం గణేషుడిని ప్రార్థించాను. విఘ్నహర్త అనుగ్రహంతో అందరికీ మేలు జరగాలనీ, దేశం కంటిన్యూగా డెవలప్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇవాళ BJP నేతలు, కార్యకర్తలు కూడా మోదీ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేస్తున్నారు.
