డెయిరీ ఉత్పత్తి కేంద్రాలపై TG-SAFE దాడులు

TG: హైదరాబాద్లో స్వీట్లు, కోవా తయారీ కేంద్రాలపై నిన్న TG-SAFE అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 3 లక్షల 78 వేల విలువైన 2,480 కిలోల కోవా, లడ్డూలు, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అపరిశుభ్ర పరిస్థితులు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా మూడు సంస్థల లైసెన్సులను నిలిపివేశారు. లైసెన్సులు లేకుండా నడుస్తున్న మరో రెండు యూనిట్లను మూసివేయాలని ఆదేశించారు. కల్తీపై అనుమానంతో ఎనిమిది నమూనాలను పరీక్షల కోసం సేకరించారు.
