అంతరిక్షంలో ఫుట్‌బాల్ మ్యాచ్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో వ్యోమగాములు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. మైక్రోగ్రావిటీలో తేలియాడుతూనే బంతిని పాస్ చేసుకుంటూ, గోల్స్ కొడుతూ ఆటను ఆస్వాదించారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్ ఈ వీడియోను ‘ఎక్స్’లో పంచుకున్నారు. వీకెండ్‌లో సరదాగా గడిపేందుకు ఫుట్‌బాల్ ఆడామని, ఇది తమను ఉత్సాహంగా ఉందని మేనన్ తెలిపారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.



