15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా కట్?

పిల్లలను సోషల్ మీడియా, AI చాట్‌బాట్లకు దూరంగా ఉంచేందుకు యూరోపియన్ యూనియన్ కొత్త రూల్స్ తీసుకురావాలని చూస్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలు Instagram, TikTok, YouTube వంటి యాప్‌లను వాడకుండా పరిమితులు విధించే అవకాశం ఉంది. AI Chatbots వాడకంపైనా ఆంక్షలు పెట్టాలని భావిస్తోంది. పిల్లలను ఆన్‌లైన్‌లో వచ్చే ప్రమాదాల నుంచి కాపాడటమే ఈ ప్రతిపాదన లక్ష్యం.


