చిల్లేపల్లిలో 'ఇరుముడి' మూవీ

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత ప్రాంగణంలో ఇటీవల ప్రజాదరణ పొందిన 'ఇరుముడి' సినిమాను ప్రదర్శించారు. భక్తుల కోరిక మేరకు శ్రీ కనకదుర్గ కమిటీ ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. మూవీ చూడటానికి స్థానికులు, భక్తులు భారీగా రావడంతో టెంపుల్ ఏరియాలో సందడి నెలకొంది.



