← Back to news

గణేశ్ నిమజ్జనంపై రేణు దేశాయ్ పోస్ట్

By A.Ajay· 1d ago

గణేశ్ నిమజ్జనం టైమ్‌లో రాత్రి పెద్ద శబ్దంతో డ్రమ్స్ మోగించడంపై నటి రేణు దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇలాంటి శబ్దం ఇబ్బందిగా ఉంటుందని ఆమె అన్నారు. వేడుకలను సాయంత్రం లేదా రాత్రి 7–8 గంటలలోపే పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టమ్‌లపై నిబంధనలు ఉన్నందున ఆమె పోస్ట్ చర్చకు వచ్చింది.

More in Current Affairs