GenZకి బిగ్ షాక్.. ఓటర్ ఐడీ కార్డుల ప్రాసెస్ లేట్!

ECలో అంతర్గత విభేదాల వల్ల స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రాసెస్ ఆలస్యమవుతోంది. దీనివల్ల GenZకి కొత్తగా ఓటర్ ఐడీ కార్డులు రావడం డిలే అయ్యే అవకాశం ఉంది. ప్రతీ ఏటా మే-జూన్ నాటికి నోటిఫికేషన్ రావాల్సి ఉండగా, 2026-27 షెడ్యూల్ దాటిపోయింది. SSRని స్టార్ట్ చేయాలని కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పట్టుబట్టగా.. CEC జ్ఞానేష్ కుమార్ లీగల్ ఒపీనియన్ కోరడంతో డిలే అవుతోంది. ఈ వివాదంతో దాదాపు 50 మంది అధికారుల కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ కూడా నిలిచిపోయాయి.



