22A పేరుతో భూదందా!

TG: 22A నిషేధిత భూముల జాబితా పేరుతో భూదందా జరుగుతోందని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. ఏళ్లుగా ప్రజల ఆధీనంలో ఉన్న పట్టా భూములు, వ్యవసాయ భూములు, ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారని విమర్శించారు. వాటిని తొలగించుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత BRS, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై విచారణ జరపాలని BJP నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్, BRS మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని కూడా BJP నేతలు ఆరోపించారు.
