పుంగనూరులో దాడులపై మిథున్ రెడ్డి ఫైర్!

అన్నమయ్య జిల్లా పుంగనూరులో TDP కూటమి నేతలు బయటి వ్యక్తులతో దాడులు చేస్తున్నారని ఇది ఓటమి భయమేనని YCP MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే నేరుగా ఎన్నికల్లో తలపడండని సవాల్ విసిరారు! నామినేషన్లు స్వీకరించవద్దని ROకు పై నుంచి ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థను ఉపయోగించి అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని దాడులు, బెదిరింపులకు భయపడమని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు!



