విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥

ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన యువత ఆందోళనపై త్వరలో డాక్యుమెంటరీ రాబోతోంది. జర్నలిస్ట్ అతుల్ హోవలే దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఈ ఉద్యమాన్ని రికార్డు చేశారు. బేగంపురా ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆందోళన, సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష నుండి పార్లమెంట్ మార్చ్ వరకు.. వీధుల్లోనే వారాల తరబడి ఉన్న విద్యార్థుల ఉద్యమం రియల్ స్టోరీని ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాం అని డైరెక్టర్ ప్రకటించారు.


