నా హక్కులు కాలరాస్తే తిరగబడతా

TG: తుంగతుర్తి కాంగ్రెస్‌లో గ్రూప్‌వార్ నడుస్తోంది. తుంగతుర్తి MLA మందుల సామేల్, భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. MLAగా తన హక్కులు కాలరాస్తే తిరగబడతానని హెచ్చరించారు. BRS నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లకు, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డవాళ్లకే టికెట్లు ఇచ్చామని చెప్పారు. తుంగతుర్తి గ్రూప్‌వార్ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సూచించింది. ఈ నేపథ్యంలో నేడు గాంధీభవన్‌లో సామేల్ జగ్గారెడ్డితో భేటీ కానున్నారు.



