← Back to news

పశువుల కాపరి నుంచి పిల్లల డాక్టర్.. మాజీ డిప్యూటీ సీఎం!

By Surendar· 2d ago· Koti, Hyderabad, Hyderabad
పశువుల కాపరి నుంచి పిల్లల డాక్టర్.. మాజీ డిప్యూటీ సీఎం!

''సాధారణ కుటుంబంలో పుట్టాను. చదువు మధ్యలో ఆపేసి పశువుల కాపరి అయ్యాను. ఒక టీచర్ సపోర్ట్ తో మళ్లీ స్కూల్ కి వెళ్లి పసిపిల్లల డాక్టర్ అయ్యాను.'' అని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజన్న తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. కోఠిలోని బీసీ సాధికార సంస్థలో జరిగిన తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం (MJF) 3వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిగ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, సదాలక్ష్మి లాంటి మేధావులను ఆదర్శంగా తీసుకోవాలని MJF మాదిగల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు.

More in Local