గంగపుత్రుల కష్టాలకు ఎట్టకేలకు పరిష్కారం

నిర్మల్ జిల్లా బాసరలో 25 నెలలుగా నిలిచిపోయిన గంగపుత్రుల బోట్లను ఎమ్మెల్యే రామారావు పటేల్ తిరిగి ప్రారంభించారు. పవిత్ర గోదావరి నదిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న 60 గంగపుత్రుల కుటుంబాలకు దీంతో మళ్లీ ఉపాధి లభించింది. బోట్లు నిలిచిపోవడంతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి బోట్లు తిరిగి ప్రారంభమయ్యేలా చొరవ తీసుకున్నారు.



