← Back to news

'పోలీస్‌స్టేషన్‌లో సిటిజన్‌ చార్ట్‌ పెట్టాలి'

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
'పోలీస్‌స్టేషన్‌లో సిటిజన్‌ చార్ట్‌ పెట్టాలి'

అరకులోయ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదులు, సమస్యలతో వచ్చే ప్రజలకు సులభంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు మోస్యా సుజాత సాల్మన్‌ కోరారు. స్టేషన్‌లో నోటీస్‌ బోర్డు, సిటిజన్‌ చార్ట్‌, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎవరిని సంప్రదించాలి, ఫిర్యాదు ఎక్కడ ఇవ్వాలనే వివరాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. గిరిజనులు, మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

More in Local