UPI ఛార్జీలు భారీగా తగ్గించాలంటున్న IIT బాంబే!

UPI పేమెంట్స్‌పై వ్యాపారులు చెల్లించే ఛార్జీలను తగ్గించాలని IIT బాంబే స్టడీ సూచించింది. ప్రస్తుతం ఉన్న MDR ఛార్జీని 0.40 శాతం నుంచి 0.08 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందులో 0.06 శాతం PhonePe, Google Pay వంటి పేమెంట్ యాప్స్‌కు, మరో 0.02 శాతం బ్యాంకులకు ఇవ్వాలని తెలిపింది. ఈ మార్పు అమల్లోకి వస్తే వ్యాపారులపై ఛార్జీల భారం తగ్గొచ్చు. అయితే ఇది స్టడీలో చేసిన సూచన మాత్రమే.. అమల్లోకి వచ్చిన నిర్ణయం కాదు.


